సంఘటితమై సమస్యలు పరిష్కరించుకుందాం -

సంఘటితమై సమస్యలు పరిష్కరించుకుందాం -

పెండింగ్ లో ఉన్న డిఏ లు వెంటనే విడుదల చేయాలి: టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్. 

విశ్వంభర,  ఎల్బీనగర్ :  రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ఉద్యోగులందరూ  సంఘటితమై సమస్యలను పరిష్కరించుకుందామని, పెండింగ్లో ఉన్న డిఏ లు, ఇతర సమస్యలను వెంటనే ప్రభుత్వం తీర్చాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నరసింహారెడ్డి, కార్యదర్శి ముక్రం ఆధ్వర్యంలో  టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీలకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.

 మారం జగదీష్ మాట్లాడుతూ పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల గురించి మాట్లాడే నాధుడే కరువయ్యాడని అన్నారు. కొన్ని సంఘాల మాటల వల్లనే ఉద్యోగులు ప్రభుత్వానికి దూరం అవుతున్నారని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. పెండింగ్  బిల్లులు, డిఏ ,పిఆర్సి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. చాలా శాఖలలో 10 మంది చేసే పనులు ఒక ఉద్యోగే చేస్తున్నాడని అన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన సిపిఎస్ విద్రోహ దినం గా పాటిద్దామని తెలిపారు. 

Read More హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి - ట్రాఫిక్ ఎస్సై మనోహర్, ఏ ఎస్సై సోమనాథ్ వాహనదారులకు విజ్ఞప్తి 

అనంతరం టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ 010 పద్దు నుండి మార్కెటింగ్ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలని అన్నారు. మార్కెట్ ఆదాయాన్ని బట్టి పునర్విభజన చేయాలని, 25 సంవత్సరాలుగా పునర్విభజన చేయలేదని వెంటనే ఆ పనిని చేపట్టే విధంగా మంత్రినీ కోరుతామన్నారు. దాదాపు మార్కెటింగ్ శాఖలో 1800 మంది ఉద్యోగులు ఉంటే  1200 మంది పదవి విరమణ చేశారని,
600 మంది ఉద్యోగులే ఉన్నారని అన్నారు. ఖాళీల భర్తీపై శాఖ అధికారులు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.

 అనంతరం చిలుక నరసింహారెడ్డి మాట్లాడుతూమార్కెటింగ్ శాఖలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినెల 5వ తేదీ లోపు జీతభత్యాలు వెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు,  ముత్యాల సత్యనారాయణ గౌడ్, లక్ష్మణ్, కొండల్ రెడ్డి, పర్వతాలు, గోవర్ధన్ రెడ్డి, సంతోష్ , వివిధ జిల్లాల మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

 

Tags: