మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు . 

మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు . 

  • రైతులకు యూరియా కొరత సృష్టించిందే  కాంగ్రెస్ పార్టీ 
  • ఆరు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది.  
  • మీడియా సమావేశంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు

విశ్వంభర, వికారాబాద్ :-  నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారెంటీలను మరిచి పాలన చేస్తుందని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గఫార్, బి. అశోక్ లు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి మాత్రమే గ్రామాలలో కనిపిస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న అభివృద్ధి మాత్రం శూన్యమని వారన్నారు. రాష్ట్రంలో అధికారం చేపడితే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వాటిని అమలు చేయడం చేతకావడం లేదన్నారు. ఒంటరి మహిళలకు, వృద్ధాప్య పింఛన్బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 2 వేల రూపాయలు బదులు 4000 ఇస్తామని, వికలాంగులకు 4 వేలు పింఛన్ 6 వేలు  పెంచి అందిస్తామని 20 నెలలు గడుస్తున్న ఇవ్వడం లేదన్నారు. మండల ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం చేసి ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఉండడం మన మండలానికి గర్వకారణమని వారిని మేము కూడా గౌరవిస్తామన్నారు. స్పీకర్ హోదాలో ఉండి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ నాయకులకు పొందలేవా అని వారు ప్రశ్నించారు. గత బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కెసిఆర్ కిట్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి, షాది ముబారక్, షీ టీమ్స్, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్లు, సంక్షేమ హాస్టల్లో, సన్న బియ్యం అన్నం, నూతన గురుకులాలు, బాలికలకు ఆరోగ్య కిట్లు, చేనేత లక్ష్మి, రుణమాఫీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, కంటి వెలుగు, హరితహారం, టీ హబ్, వీ హబ్, నూతన పారిశ్రామిక విధానం ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు గంటల సమయం పడుతుందని వారన్నారు. గ్రామాలలో యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి రైతులకు యూరియా సకాలంలో సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని సంక్షేమ పథకాల అమలు చేసిన కేసీఆర్ ను, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ పై మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దూషించి మాట్లాడడం సరైనది కాదని, సిద్ధాంతపరమైన బహిరంగ చర్చలకు తాము సిద్ధమని వారన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఘనత దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఆయా గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, మర్పల్లి మండల యూత్ అధ్యక్షులు బోయిని మధుకర్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, అశోక్, వికాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: