చేనేత సమస్యలపై పుట్టపాక లో మహా పోరాట దీక్ష శిభిరం 

  చేనేత సమస్యలపై పుట్టపాక లో మహా పోరాట దీక్ష శిభిరం 

చేనేత కార్మికులను ఆదుకోవాలని గ్రామ వీధులలో ర్యాలీ 

పుట్టపాక , విశ్వంభర :- చేనేత కార్మికుల  సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలో  చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు, పద్మశాలీలు చేనేత కార్మికుల మహా పోరాట ర్యాలీ తీస్తూ ధర్నా చేపట్టారు.చేనేత కార్మికులు పెద్ద ఎత్తున గ్రామంలోని  వీధుల గుండా తిరుగుతూ చేనేత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్లొగన్స్ చేస్తూ ప్లకార్డులు, ఫ్లెక్సీ  ప్రదర్శిస్తూ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైటయించి రాస్తారోకో చేశారు.చేనేత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు దీక్ష శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ దీక్ష శిభిరంలో జాతీయ అవార్డు గ్రహీత ఆనందం నాగరాజు, గూడెల్లి బాలరాజు, రావిరాల శ్రీనివాస్, వర్కాల వెంకటేశం, పాల్గొన్నారు.దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని పలు డిమాండ్ల తో కూడిన అంశాలను ప్రస్తావించారు . చేనేత వ్యక్తిగత రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేయాలనీ, చేనేత భీమా ఆరోగ్య కార్డులను అందించాలని , నేతన్న చేయూత థ్రిఫ్టు ఫండ్ కొనసాగింపు , యాభై ఏళ్ళు నిండిన చేనేత కార్మికుల భార్య, భర్తలకు పెన్షన్ అమలు చేయాలని ,నలబై శాతం నూలు సబ్సిడీ నేరుగా కార్మికుని ఖాతాలో జమ చేయాలనీ,నిల్వ ఉన్న సరకును వెంటనే కొనుగోలు చేసి , చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరడం జరిగింది.జి ఐ ఉన్న డిజైన్ లను ప్రింటింగ్ చీరలను తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు ప్రభుత్వం చేనేత  చీరెలను పంపిణీ చేయాలని  కోరారు. చేనేత రంగానికి రూ.పదివేల కోట్లు కేటాయించాలన్నారు.  తమ పోరాటం దీంతో ఆగదని ప్రభుత్వం స్పందించకుంటే  మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గజం భద్రయ్య, నెలికంటి శ్రీశైలం, కర్నాటి శ్రీనివాసు, బండమీది కిరణ్, శంకరు, మహేష్, వివిధ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించి దీక్ష లో పాల్గొనడం జరిగింది. WhatsApp Image 2024-08-01 at 15.02.19 (1)


    ఏలే మహేష్ నేత 
    సీనియర్ జర్నలిస్ట్ 
స్టేట్ ఛీఫ్ కరెస్పాండంట్ 
v3 న్యూస్ ఛానల్ & విశ్వంభర దిన పత్రిక 
సెల్ : 9705646377

Read More బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్

Tags: