ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల..!
ఇంజినీరింగ్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం కల్పించనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఇవాళ(శుక్రవారం) ఉదయం 10గంటలకు విడుదల చేశారు. ఇంజినీరింగ్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం కల్పించనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
గురువారం అగ్రికల్చర్, ఫార్మసీ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 16న ప్రారంభమైన ఏపీ ఎప్ సెట్ -2024 పరీక్షలు మే 23తో ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం రెండు విభాగాలకు కలిపి 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో 3,39,139 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 93.47 శాతం హాజరయ్యారు. ఇక విభాగాలవారీగా పరిశీలిస్తే ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 80,766 (91.12 శాతం) విద్యార్థులు హాజరయ్యారు.