తెలంగాణ RMP - PMP సంఘాల సభలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్

01

తెలంగాణ ఆర్ఎంపీ, పి.ఎం.పి సంఘాల ఉమ్మడి వేదిక సభలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపి పి.ఎం.పిల సేవలను మెరుగుపరిచి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ళ స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది.  పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న  వాళ్లపైన కేసులు బనాయించడం తర్వాత అరెస్టు చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదు. వాళ్లకేదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేసి వాళ్లకు పరిధి విధించి వాళ్ళ పరిధిలో వైద్యం చేసే విధంగా చేయడమే దానికి సరైన పరిష్కారం మార్గం.

Read More   చండూర్ లో బంపర్ ఆఫర్ - వామ్మో మొదటి బహుమతి 10 కేజీ ల మేక.. 2వ బహుమతి ఏమిటో తెలుసా ..!  99 కొట్టు మేకను పట్టు    

02

మీపై దాడులు జరుగుతున్నాయని మీరు వైద్యవృత్తికి దూరంగా ఉండడానికి వీలులేదు. మిమ్ములను నమ్ముకుని ఎవరైతే పేద ప్రజలు గ్రామాలలో రైతాంగం ఉన్నారో వాళ్లకు నిర్మూహమాటంగా వైద్యవృత్తిని మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పది పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి తప్పకుండా ముందుంటాం. ఇవాళ రాష్ట్రంలో ఈ సంఘాలన్నీ కలిసి ఒక వేదికగా ఏర్పడి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఇంకెవరైనా సంఘాల వాళ్ళు ఉంటే వాళ్లంతా కూడా వీళ్ళతో కలిసి వచ్చి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ కావలసింది గుర్తింపు ఆత్మగౌరవం సర్టిఫికెట్ అదే జెండా కావాలి. కనుక మీరు అందరు కలిసి రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తప్పకుండా ఈ సమస్యను సరిత గతిన పరిష్కారం అయ్యే విధంగా చూస్తాం. విజ్ఞానదర్శిని వారికి సూచన చేస్తున్నా వఇవాళ ఈ సమస్యను వాళ్ళూ వీళ్లు  అనేటటువంటి కోణంలో చూడడం కాకుండా విజ్ఞానదర్శిని ప్రజా వైద్యం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కౌన్సిల్ వారిని, డాక్టర్స్ అసోసియేషన్స్ వారిని, RMP, PMP సంస్థలను కూర్చుండబెట్టి ఒక వేదిక ఏర్పాటు చేస్తే దానికి ప్రత్యనే మార్గాన్ని కూడా ఆలోచించడానికి ఉంటుందని నేను రమేష్ గారిని ఆ కోరుతున్న తప్పకుండా ఇలాంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షకాలం వ్యాధులు ముదిరే అటువంటి సమయంలో ఇలాంటివి రావడం మంచిది కాదు. కనుక తప్పకుండా ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను అని కోదండరాం గారు పేర్కొన్నారు.