ఎంపీ వద్దిరాజును సత్కరించిన శ్రీమణికంఠ మహా పాదయాత్ర భక్తులు

ఎంపీ వద్దిరాజును సత్కరించిన శ్రీమణికంఠ మహా పాదయాత్ర భక్తులు

విశ్వంభర, హైద్రాబాద్ : పాతబస్తీకి చెందిన శ్రీమణికంఠ మహా పాదయాత్ర భక్తులు మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుస్తే శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చేత మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరింపజేశారు. ఈ మహా పాదయాత్ర వచ్చే నెల 17వతేదీన పాతబస్తీ గౌలిపురా నుంచి ప్రారంభమై కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయానికి బయలుదేరుతుంది. ఎంపీ వద్దిరాజును కలిసిన వారిలో పవన్ రెడ్డి, కృష్ణ గురుస్వామి,యశ్వంత్, గోపాల్ రెడ్డి గురుస్వామి, హిమగిరి తదితరులు ఉన్నారు

Tags: