సైకో, శాడిస్ట్ రేవంత్ రెడ్డి - ఎంపీ ఈటల రాజేందర్ 

సైకో, శాడిస్ట్ రేవంత్ రెడ్డి - ఎంపీ ఈటల రాజేందర్ 

విశ్వంభర , ధర్నా చౌక్ :  ఎవరి మాట వినని సైకో, ప్రజలను ఏడిపించి ఆనందించే శాడిస్ట్ రేవంత్ రెడ్డి అని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో  రైతు హామీల సాధన దీక్ష ముగింపు సభలో సీఎం పై  మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సత్తా కేవలం బీజేపీకే ఉందని , రైతులను కూడగట్టి ఈ దీక్ష చేస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ ను  మట్టి కలిపిసినట్టే , రేవంత్ కూడా అదే గతి పట్టించడం ఖాయం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నాయకులారా సిఎం మెప్పుకోసం మీరు పలుకుతున్న చిలకపలుకులు మీ గౌరవం తగ్గిస్తాయి. మామీద ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ఆత్మపరిశీలన చేసుకోండి. బేషరతుగా  2 లక్షల రూపాయలు వెంటనే వారి అకౌంట్ లో వేయాలి. లేదంటే నమ్మిన రైతులే బొందపెడతారు అంటూ కాంగ్రెస్ పార్టీ పై విరుచుక పడ్డారు. అదే విధంగా  ఎల్లుండి ఇందిరాపార్క్ వద్దనే రింగ్ రోడ్డు ధర్నా ఉందని తెలిపారు. రేవంత్ బ్రెయిన్ చైల్డ్ అని  హైడ్రా, మూసీ ప్రక్షాళన కాబట్టి , నిన్న కోర్టు చివాట్లు పెట్టింది, మొట్టికాయ వేసింది అధికారులను కాదు, రేవంత్ రెడ్డికి అని ఎద్దేవా చేసారు.  నిజంగా నీకు చట్టం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. నీకు కోర్టులు జడ్జీలు లెక్కలేదా ?  అంటూ మాట్లాడారు. 24 గంటలు పాటు సహకరించిన పోలీసులు, మీడియా, కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. 

Tags: