యాదాద్రిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ

యాదాద్రిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ

విశ్వంభర, యాదగిరిగుట్ట : స్వాతంత్య్ర  సమర యోధులు, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతినీ పురస్కరించుకొని  యాదగిరి గుట్టలోనీ అఖిల భారత పద్మశాలి అన్నసత్రం లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.  అన్నసత్ర అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాటి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచడమే కాకుండా, తన మంత్రి పదవి త్యాగం చేసి తెలంగాణా కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహోన్నతమైన వ్యక్తి, శక్తి బాపూజీ అని కత్తుల సుదర్శన్ రావు తెలిపారు. అంతే కాకుండా బహుజనుల రాజ్యాధికారం కోసం నిరంతరం  తపించిన గొప్ప నేత అని అన్నారు.   ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశాలి నాయకులు ప్యాట్రన్  చిలువేరు కాశీనాధ్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, గడ్డం జగన్నాధం, కళ్లేపల్లి రాజు నేత , ఏలే మహేష్ నేత ,  పలువురు పద్మశాలి, చేనేత నాయకులు, అన్నసత్ర సభ్యులు  పాల్గొన్నారు.

Tags: