కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశా: రఘునందన్ రావు

 కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేశా: రఘునందన్ రావు

  • తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న బీజేపీ ఎంపీ
  • మహిళలపై ట్రోలింగ్‌ను తిప్పికొడతామని వెల్లడి
  • హైడ్రాపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రభుత్వానికి సూచన

 


విశ్వంభర, హైద్రాబాద్ :  మంత్రి కొండా సురేఖపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వస్తున్న ట్రోలింగ్‌ను తిప్పికొడతామన్నారు.
తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మంత్రిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎంత పెద్దవారైనా శిక్షపడేలా చేస్తామన్నారు. హైడ్రా నిబంధనలపై అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీలను ఆహ్వానించాలన్నారు. హైడ్రాపై కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కూడా బుల్డోజర్‌లతో కూల్చిన విషయాన్ని మరిచినట్లున్నారని చురక అంటించారు.

Read More మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tags: