చండూర్ లో బంపర్ ఆఫర్ - వామ్మో మొదటి బహుమతి 10 కేజీ ల మేక.. 2వ బహుమతి ఏమిటో తెలుసా ..!  99 కొట్టు మేకను పట్టు    

  చండూర్ లో బంపర్ ఆఫర్ - వామ్మో మొదటి బహుమతి 10 కేజీ ల మేక.. 2వ బహుమతి ఏమిటో తెలుసా ..!  99 కొట్టు మేకను పట్టు    

విశ్వంభర,చండూర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గొప్పగా జరుపుకునే పండుగ దసరా పండుగ .. అలాంటిది దసరా అంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా దావత్ లు చేసుకోవడం , బట్టలు కొనుక్కుని ఎంజాయ్ చేయడం.. కుటుంభం కుటుంభం ఆనందంగా గడుపుకుంటూ ముక్క, చుక్క లతో సంతోషంగా గడుపుతారు. మరి అలంటి పండగ వచ్చిందంటే వ్యాపారస్తులు అంతగా ఒక నెల ముందు వారికి సంబందించిన వస్తువులు తెచ్చుకొని క్రయ, విక్రయాలు చేస్తుంటారు. తెలంగాణాలో పెద్ద పండుగ కాబట్టి అన్ని రంగాల వ్యాపారస్తులు ఆఫర్స్ , బంపర్ డ్రా లు పెడతారు. కూపన్స్ ఇచ్చి దసరా రోజు డ్రా తీసి ఏ బహుమతి వస్తే ఆ బహుమతి ఇస్తుంటారు. మరి నల్గొండ జిల్లా చండూర్ పట్టన కేంద్రంలో సరిక్రొత్త ఆలోచన తో యువకులు చండూర్ పట్టణ ప్రజలకు దసరా ఆఫర్ అంటూ బహుమతుల బోర్డు పెట్టారు. బతుకమ్మ , దసరా శుభాకాంక్షలతో ఒక డ్రా పెట్టారు. 99 రూపాయలు పెట్టి  కూపన్ కొనుక్కుంటే దసరా రోజు అక్టోబర్ 10 వ తేదీన డ్రా తీస్తారంటా ... మొదటి బహుమతి 10 KG ల మేక , 2ND 2 బ్లెండర్ స్ప్రెడ్  ఫుల్ బాటిల్స్ , 3వ కాటన్ బీర్లు , 4వ 2 నాటు కోళ్లు ,  5వ 1 రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ,  6వ 25 కేజీల బియ్యం ,  7వ 4 జుట్టు కోళ్లు ,  8వ  మూడు బాటిల్స్ కూల్ డ్రింక్స్ , 9వ 5 కాగ్ ల చికెన్ ,  10వ ఒక రైస్ కుక్కర్ మారేందుకు ఆలస్యం 99 కొట్టు మేకను పట్టు   

Tags: