మందకృష్ణ కృషి చిరస్మరణీయం
విశ్వంభర, బోడుప్పల్ : అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించే కార్యక్రమం 285 ఆదివారాలుగా బోడుప్పల్ లో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ మాదిగల వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ కృషి, ఎంతోమంది అమరులైన మాదిగల త్యాగ ఫలితంగా సుప్రీంకోర్టు లోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం మాదిగల వర్గీకరణ న్యాయబద్ధమని తీర్పునివ్వడం హర్షనీయమని నత్తి మైసయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో భూపరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య,గరుగుల యాకయ్య,ఈల అంజయ్య,సగ్గు నరసింహ మూర్తి, కంచి సతీష్, దానగళ్ళ చిన్న యాదయ్య,సవరపు బయన్న జై భీమ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.