Kishanreddy: గ్యారంటీలు అమలుచేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు: కిషన్ రెడ్డి 

Kishanreddy: గ్యారంటీలు అమలుచేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు: కిషన్ రెడ్డి 

ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల  నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల  నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయన్నారు. 

బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కుటుంబపాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాడుతామని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి