లేడీ కాదు ఖిలాడీ.. 17 ఏళ్ల బాలుడిపై కన్నేసి.. చివరకు దారుణం
ఈ నడుము జరుగుతున్న దారుణాలు చూస్తుంటేనే భయం వేసేలా ఉంది. ఇన్ని రోజులు అమ్మాయిలకే రక్షణ లేదు అనుకుంటే.. ఇప్పుడు అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఇప్పుడు ఓ లేడీ ఖిలాడీ గురించి తెలుసుకుంటే నిజంగా ఇలాగే అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని హనుమాన్ నగర్‌లోని ఓ ఇంట్లో మహిళ గత మూడేళ్ళుగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.
అయితే ఆమె తన ఇంటి ఓనర్ కొడుకుపై కన్నేసింది. ఆ 17 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. అతనితో శారీరకంగా ఎంజాయ్ చేసింది. కొన్ని రోజులు ఈ తతంగం సాగించిన తర్వాత.. ఎక్కడికైనా పారిపోదాం అంటూ అతన్ని నమ్మించింది. ఇంట్లో డబ్బులు, నగలు తీసుకురావాలని ఒప్పించింది. దాంతో ఆ బాలుడు ఇంట్లో నగదు, నగలు తీసుకుని రావడంతో అతనితో గత జనవరి 17న కలిసి చెన్నైకి పారిపోయింది.
దాంతో ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిద్దరూ చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు తమకోసం వెతుకుతున్నారని గుర్తించిన మహిళ.. ఆ బాలుడిని గత మంగళవారం అతని ఇంటి వద్ద వదిలేసింది. బాలుడు తీసుకొచ్చిన నగదు, నగలతో జల్సాలు చేసింది. కానీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె మీద ఫోక్సో చట్టం పెట్టారు. రిమాండ్‌కు తరలించారు.