మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత
మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా సరే ఆరోగ్యం కోలుకోకపోడంతో పరిస్థితి విషమించింది. దాంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రమేశ్ రాథోడ్ ఆదిలాబాద్ నుంచి 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.
బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. కానీ గెలవలేదు. ఇక ఆయన 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006–2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.