బీటి రోడ్డు కై ధర్నా
On
విశ్వంభర, కౌకుంట్ల :- మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని పుట్టపల్లి గ్రామం నుండి అమ్మాపూర్ వెళ్లే దారి గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు నిర్మాణ పనులు జరగక ప్రజలు అవస్థ లు పడు తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన మార్పులు రావట్లేదని వర్షాకాలం వస్తే రోడ్ల గుంతల మయానికి ప్రజలు కింద పడుతూ, పక్కనే ఉన్న స్కూల్ పిల్లలపై బురద పడుతూ, అధిక బరువు గల వాహనాలు ఈ రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుంటే ఇంకా ఎన్ని రోజులు చోద్యం చూస్తూ కూర్చోవాలని శనివారం ఉదయం 11 గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని పుట్టపల్లి నరేందర్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి మండలo లోని ప్రతి ఒక్క గ్రామం నుండి యువత కదిలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం



