బాల గణేష్ యూత్ అసోసియేషన్ ముగ్గుల పోటీలు, మహా హారతి
On
విశ్వంభర, శివ పార్వతి గోదాం, లాల్ దర్వాజా :- బాల గణేష్ యూత్ అసోసియేషన్, లాల్ దర్వాజాలో రెండు ఫీట్లతో మొదలైన గణేశుడు ఇంతింతై వటుడింతై తానంత కొండంతై అన్నట్టుగా 25 సంవత్సరాల నుండి నెలకొల్పుతున్న ఈ వినాయకుడు బస్తీ వాసులకు నిత్యo నిత్య ఆరాధ్యకుడై 12 ఫీట్లతో ప్రతిష్టాపన చేశారు. ఈయనకు ప్రతిరోజు హారతులు, మహా హారతులు, వివిధ రకాలైన కళాకారుల వేషధారణలు మరియు మహిళలకు ముగ్గుల పోటీలు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుకోయల్ కార్ సాయికుమార్ తెలిపారు. సభ్యులు జనరల్ సెక్రెటరీ రాఘవ రాజ్, ఉమేష్, రాహుల్, సచిన్, విక్కీ, సప్నేష్ తదితరులు పాల్గొంటామని తెలిపారు.



