ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్!

ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో దీన్ని సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియాను రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. చాలా రోజుల నుంచి ఆమెనే చీఫ్ గెస్ట్‌గా పిలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియా రాకపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ఆమె ఆహ్వానించనున్నారు.  

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తరాదిలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్నారు. దీంతో.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియాను కలిస్తే.. ఆ మీటింగ్‌కు భట్టి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. పలువురు రాష్ట్రమంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

Read More రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ

సోనియా హాజరుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. జూన్ 4 న ఫలితాలు ఉంటాయి. దీంతో జూన్ 2న తెలంగాణకు రావడం కుదరుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా రప్పించాలని భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో దీన్ని ఒక మైలురాయిగా మిగిలిపోయేలా చూడాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ సమాజానికి బలమైన మెసెజ్ ఇవ్వాలనుకుంటోంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా