ఏ పనినైనా ధ్యానంగా చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

ఏ పనినైనా ధ్యానంగా చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

ధ్యానం ఒక పనిగా కాకుండా.. ప్రతి పనిని ధ్యానంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదివితే రెండు లైన్ల మాదిరిగా అనిపించినా.. అర్థం చేసుకుంటే.. ప్రపంచ పరిజ్ఞానం అందులోనే ఇమిడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  

 

Read More నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

రాజ్యం, అధికారం ఉన్నా.. వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారని గుర్తు చేశారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉండటానికి కారణం అందులో ఉన్న గొప్పతనమేనని చెప్పారు. ఏ పనిని అయినా తాను ధ్యానంలా చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

 

Read More నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బుద్ధుని సందేశం ఎంతో అవసరమని చెప్పారు. అందుకే ఒక పాఠశాలను నిర్వహించాలని తాను కోరతున్నట్టు చెప్పారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని.. స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నుంచి బయటకు రావాలంటే బుద్దుని సందేశం అవసరమని తెలిపారు. బుద్దిని ఆలోచనలు సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గరకు చేరాల్సిన అవసరం ఉందన్నారు. దానికి అవసరమైన సహాయం వ్యక్తి గా, ప్రభుత్వ పరంగా చేస్తానని హామీ ఇచ్చారు.