ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: చిరంజీవి

ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: చిరంజీవి

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 

‘కొందరి కీర్తి అజరామరం.. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు ‘భారత రత్న’ పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నా. తెలుగు వారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read More కార్మికులకు పేద ప్రజలకు కేంద్ర బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు

ఇక చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఏకైక సినిమా 'తిరుగులేని మనిషి'. ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఇద్దరూ తమ కెరీర్‌లో స్టార్లుగా ఉన్నా  కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకునేవారు.

Tags: