తెలంగాణలో 12 స్థానాలు మావే.. మాజీ మంత్రి డీకే అరుణ కామెంట్స్! 

తెలంగాణలో 12 స్థానాలు మావే.. మాజీ మంత్రి డీకే అరుణ కామెంట్స్! 

తెలంగాణలో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. అయితే ఈసారి ఈ ఎన్నికలలో భాగంగా ఏ పార్టీ విజయం అందుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణలో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. అయితే ఈసారి ఈ ఎన్నికలలో భాగంగా ఏ పార్టీ విజయం అందుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే భాజాపా మహిళా నేత మాజీ మంత్రి డీకే అరుణ ఈ ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

 

Read More బ్రిటన్ లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

మహబూబ్ నగర్ లో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో భాగంగా డీకే అరుణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ప్రచార కార్యక్రమాలకు వచ్చిన యువతను భయపెట్టాలని చూసిన వారందరూ కూడా బాజాపా ప్రభుత్వం వైపే ఉన్నారని తెలిపారు. కేంద్ర సహాయంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లామని అరుణ వెల్లడించారు. 

 

Read More బ్రిటన్ లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

యువతతో పాటు ఎస్పీ ఎస్టీ బీసీ మైనారిటీ లందరూ కూడా మాకు మద్దతుగా నిలిచారని తెలిపారు. మహబూబ్ నగర్ లో సుమారు రెండు నుంచి మూడు లక్షల మెజారిటీతో గెలవబోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాలలో భాజాపా విజయం సాధించబోతోంది అంటూ ఈమె ధీమా వ్యక్తం చేశారు. మరి ఏ పార్టీ ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుంది అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాలి.