బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు

బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత అనే మహిళ ఆర్మూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ బస్సు ఆపమంటూ వెనుక నుంచి ఆ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆమెను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. 

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చి కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ కిందపడిపోయింది. బస్సు అలాగే ముందుకు కదలడంతో అదే బస్సు వెనుక చక్రాల కిందపడి సదరు మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read More మూసీ సుందరీకరణ మాత్రమే కాదు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి