కొడాలి నానిపై కేసు నమోదు

కొడాలి నానిపై కేసు నమోదు

  • మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు 
  • తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ
  • గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పలువురు మాజీ వార్డు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎన్నికలకు ముందు పలువురు వార్డు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆరోపిస్తూ వలంటీర్లు ఫిర్యాదు చేయడంతో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు సమాచారం.

Read More అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా