టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత
స్వాతంత్ర సమరయోధుడు, ఏపీ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు గోపాల కృష్ణ (64) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం.
స్వాతంత్ర సమరయోధుడు, ఏపీ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు మనవడు గోపాల కృష్ణ (64) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. ప్రకాశం పంతులుకు ఇద్దరు కుమారులు కాగా హనుమంతరావు కుమారుడు గోపాలకృష్ణ సోమవారం వేకువజామున కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమనే చెప్పాలి. అదేవిధంగా ప్రత్యేక ఆంధ్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకిత చేశారు. ప్రకాశంపంతులు జయంతి, వర్థంతుల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన మనవడు గోపాల కృష్ణ పాల్గొనే వారు.