బిగ్ షాక్.. తెలంగాణలో వైన్స్, బార్స్ బంద్

బిగ్ షాక్.. తెలంగాణలో వైన్స్, బార్స్ బంద్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు.. తర్వాత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. కానీ.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దీనికి కారణం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఉపఎన్నిక. ఈనెల 27న వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో జరగనుంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 

 

Read More పుల్లెంల గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి

కానీ ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో ప్రచారం చేశాయి. ప్రధానంగా బీఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. 

అయితే పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పాటు.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. దీంతో.. కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.  

 

Read More పుల్లెంల గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి

ఇక పోలింగ్‌కు రెండు రోజులే సమయం ఉండటంతో ఈసీ ఏర్పాట్లను సిద్దం చేస్తోంది. ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను బంద్ చేయాలని తేల్చి చెప్పింది. దీంతో 48 గంటల పాటు బార్లు, వైన్స్ మూతపడనున్నాయి. రేపు సాయంత్రం 4.00 గంటల నుంచి 27న సాయంత్రం 4.00 గంటల వరకు బంద్ కానున్నాయి.