ఘనంగా పంతులు మధుబాబు కు సన్మానం
On
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి :- సెప్టెంబర్ 5 న జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను పొందిన ముక్తాపూర్ యూ పీఎస్ ప్రధానోపాధ్యాయులు పంతులు మధు బాబు పురస్కారం అందుకోవడం పట్ల ఆ గ్రామ యువకులు, మాజీ వార్డు సభ్యులు బండారు ప్రకాష్ రెడ్డి , ఇటమోని నరేందర్ , సన్న నర్సింహ, సప్పిడి శేఖర్ రెడ్డి లు ఘనంగా సన్మానించారు. ఇలా అవార్డు రావడం ఎంతో ఆనందకరమని గ్రామానికి కూడా గర్వకారణమైన విషయం అని నరేందర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల , ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల , తోటి సిబ్బంది సహకారం వల్లనే గొప్పగా పని అందించగలిగానని మధుబాబు తెలిపారు.



