అంగన్వాడీ కేంద్రంలో సీమంతం
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని మెయిన్ రోడ్లోని అంగన్వాడి సెంటర్-1 లో అంగన్వాడి టీచర్ ఉగ్గే నాగమ్మ అధ్యక్షతన గర్భిణీలకు సీమంతం, అన్న ప్రాసన్న కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, తల్లులకు సరైన పోషకాహారం గురించి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. పిల్లలకు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారం అందించాలని తల్లులకు వివరించడం జరిగింది. అంగన్వాడి కేంద్రానికి పిల్లలను తీసుకొని వచ్చి పిల్లల బరువును, ఎత్తులను చూపించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ చిన్నం చిత్తరంజన్, ఏఎన్ఎం మమత, నీడ్స్ మంచి పరిసరాల విద్యాభివృద్ధి అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం, ఆశా కార్యకర్తలు కె పద్మ,కె భాగ్యమ్మ, యు మహాలక్ష్మి,శిరీష తదితరులు పాల్గొన్నారు.



