బోనాల ఉత్సవాల్లో మంత్రి సీతక్క, కిషన్ రెడ్డి.. భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు
Amberpet Bonalu: హైదరాబాద్ అంబర్‌పేటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అంబర్‌పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్క అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,
సంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు. అంబర్‌పేటలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. బోనాల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.