మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదా?: మోడీకి కాంగ్రెస్ సూటి ప్రశ్న 

మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదా?: మోడీకి కాంగ్రెస్ సూటి ప్రశ్న 

కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ఏదో నష్టం జరిగిపోతుందని బీజేపీ ప్రచారం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మోడీ వ్యతిరేకించడం.. ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకి నష్టం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీపై మండిపడ్డారు. 

 

Read More ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ

మహిళల నుంచి కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని బస్సులు కొనుగోలు చేసి ఈ పథకాన్ని విస్తరిస్తామని తేల్చి చెప్పారు. ఉచిత బస్పు ప్రయాణం వలన మెట్రోకి నష్టం జరుగుతుందనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని మంత్రి పొన్నం చెప్పారు. 

 

Read More ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ

మెట్రో ట్రైన్ బోగీలు కూడా పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయని ఆయన అన్నారు. మెట్రోను విస్తరిస్తూనే.. ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పేద వర్గాలకు మంచి చేసే ఆలోచన బీజేపీకి ఎలాగూ లేదని.. కానీ.. మంచి చేస్తున్నవారిపై దుమ్మెత్తి పోయడం మంచిది కాదని మండిపడ్డారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడి ప్ర‌ధాని త‌న స్థాయిని దిగ‌జార్చుకోవ‌ద్ద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా