తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.72 తగ్గించాయి. ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. 

లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో చమురు సంస్థలు శనివారం నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.72 తగ్గించాయి. ఈ తగ్గింపు ధరతో హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.1903గా ఉంది. ఇవాళ (జూన్ 1) నుంచి ఢిల్లీలో రూ.69.50, కోల్‌కతాలో రూ.72, ముంబైలో రూ.69.50, చెన్నెలో రూ.70.50 చొప్పున ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది.

డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు ఈరోజు (జూన్ 1) ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు కూడా 19 కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త వచ్చింది. ఈరోజు నుంచి ఈ బ్లూ సిలిండర్ ఢిల్లీలో రూ.1745.50కి బదులుగా రూ.1676.00కి అందుబాటులో ఉంటుంది.

Read More నగల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్