‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్ 

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్ 

  • ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం
  • తమ్ముడిని చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ట్వీట్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవాళ (శుక్రవారం) అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు ట్విట్ట‌ర్‌ వేదిక‌గా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తమ్ముడు పవన్ కల్యాణ్‌ను చూసి త‌న‌ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. 

"తోడబుట్టిన వాడిగా.. జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ క‌ల్యాణ్‌ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు.

Read More సీఎం రేవంత్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ ప్రశంసలు