గుడ్ న్యూస్ .. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మళ్ళీ మొదలు

గుడ్ న్యూస్ .. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు మళ్ళీ మొదలు

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన వీడింది. ఎట్టకేలకు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించడానికి అంగీకరించారు. సీఎస్ జవహార్ రెడ్డి చర్చలు ఫలించాయి. పెండింగ్ బకాయిలు చెల్లించలేదని మూడు రోజులుగా ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో.. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ హుటాహుటిన రూ.203 కోట్ల నిధులు విడుదల చేసింది. అయినా.. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి స్పందన లేదు. 

రూ. 1500 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని.. రూ. 203 కోట్ల సరిపోవని తెలిపారు. ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించేదే లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్.. ప్రైవేట్ ఆస్పత్రి యాజామన్యాలతో మాట్లాడింది. కానీ, ఏ మాత్రం చలించలేదు. రూ. 800 కోట్లు విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. తర్వాత ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు సీఎస్ జవహార్ రెడ్డిని కలిశారు. ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. అయితే రూ. 300 కోట్లు విడుదల చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిథిగా కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు ఒప్పుకున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆందోళనను విరమించారు. దీంతో ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఆరోగ్య శ్రీ సేవలు యథావిథిగా కొనసాగనున్నాయి. అయితే ప్రభుత్వం రూ.300 కోట్లు ఇప్పుడే విడుదల చేస్తుందా? లేకపోతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విడుదల చేస్తుందా? అనేది చూడాలి.

Related Posts