నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు

నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు

 

మామూలు మనిషిగానే రోడ్ల మీదకు వస్తా
ఇక విధ్వంస రాజకీయాలు ఉండవు

 

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతినే రాజధానిగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి నేడు తెర దించేశారు చంద్రబాబు నాయుడు. మంగళవారం ఆయన్ను ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక రాజధాని విషయంలో కూడా స్పందించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కర్నూలు అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు. 

వైసీపీ ప్రభుత్వంలా మోసం చేయబోమని.. చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తామన్నారు. గతంలో లాగా విధ్వంస రాజకీయాలు కాకుండా.. నిర్మాణాత్మక అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రబాబు చెప్పారు.

Related Posts