జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత..
మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు తాజగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చింది. ఆయన ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఇంటి ముందు ఉఉన్న అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రత కోసం అధికారులు రోడ్డును కొంచెం ఆక్రమించి మీర గదులను సిబ్బంది కోసం నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాల వల్ల రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.
దాంతో స్థానికంగా ఉన్న వారు రాకపోకలకు ఇబ్బంది అవుతోందని పలుమార్లు జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దాంతో నేడు వారు రంగంలోకి దిగారు. పొలీసుల బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు జగన్ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇదే ఇంట్లో మొన్నటి వరకు షర్మిల కూడా ఉన్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ బయటకు స్పందించట్లేదు.