యువతిపై హత్యాచారం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

యువతిపై హత్యాచారం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

బాపట్లలో చాలా దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై కొందరు దుండగులు దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఈపురుపాలెంలో ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ యువతి.. ఆలస్యం అయినా సరే తిరిగి రాలేదు. 

దాంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. కానీ చివరకు యువతి డెడ్ బాడీ రైల్వేట్రాక్ సమీపంలో లభ్యం అయింది. అక్కడ ముళ్ల పొదల్లో పడి ఉంది. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 5 ప్రత్యేక పోలీస్ బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 

కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోం మంత్రి అనితను ఆదేశించారు. ఘటన జరిగిన చోటకు వెళ్లాలని.. దర్యాప్తును పరిశీలించాలన్నారు. అంతే కాకుండా కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని చెప్పాలని తెలిపారు. దాంతో హోం మంత్రి అనిత ఘటన జరిగిన చోటుకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను చాలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. 

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts