మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మహారాష్ట్రపై ఫోకస్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత మొదట మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. అక్కడ చేరికలు కూడా జరిగాయి. అంతేకాదు.. కేసీఆర్ మహరాష్ట్ర వెళ్లి తరచూ సభలు పెడుతూ ఉండేవారు. 

 

Read More విప్లవ సింహం నల్లా నరసింహులు 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సైలంట్ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం.. తర్వాత ఆయన కాలికి గాయం కావడంతో తెలంగాణలోనే బీఆర్ఎస్ నైరాశ్యంలో పడింది. ఇక మహారాష్ట్ర నేతలను పట్టించుకున్న పరిస్థితి లేకుండా పోయింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు పలు దఫాలు ఫోన్ చేసినా.. ఆయన పార్టీ శ్రేణులకు అందుబాటులోకి వెళ్లలేదు. దీంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. బీఆర్ఎస్ మూత పడుతుందని అంతా భావించారు. కానీ.. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనే లేదని కేసీఆర్ ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పారు.   

 

Read More విప్లవ సింహం నల్లా నరసింహులు 

ఇప్పుడు మరో నాలుగు నెలల్లో జరగనున్న మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 'అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. పార్టీని వీడిన వారిపై ఫోకస్ చేస్తోంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేసి కొన్ని స్థానాలు గెలుచుకుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది.