ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి: కాచం సత్యనారాయణ.

17

విశ్వంబర, ఎల్బీనగర్ :-శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలనీ  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు . గురువారము  బాబు జగ్జీవన్ రామ్ భవనంలో  శుక్రవారం  12వ తేదీన నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల భూమిని, పెన్షన్ ఇచ్చే విధంగా త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని అని అన్నారు. 
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, ఉద్యమకారుల బాధ్యత కోదండరాం సారు తీసుకోవాలని అన్నారు.  హెల్త్ కార్డులు కూడా అందించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే వినయ్ కుమార్, ఎల్బీనగర్ టీజేఏసీ చైర్మన్ కే వి రంగారెడ్డి, టీజేఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి గుప్త,ఉప్పల శ్రవణ్, బిరెల్లి వెంకట్ రెడ్డి, రమేష్, కృష్ణా గుప్త, శ్రీధర్, ఏ .ఆంజనేయులు గుప్త, శ్యామ్ సుందర్, సువర్ణ చలమరెడ్డి, మాణిక్ రెడ్డీ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More డా. కోడి శ్రీనివాసులుకు అభినందనలు - MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి