ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

18

విశ్వంభర కూకట్ పల్లి జూలై 11 :-  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మరియు అధికారులతో కలసి డివిజన్ పరిధిలోని జింకలవాడ ప్రభాకర్ రెడ్డి నగర్ బస్తీ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి నగర్ జింకలవాడ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురౌతుందని, ఇట్టి భూమిని సర్వే చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయమని, అలాగే హద్దులు (బౌండరీలు ) పెట్టాల్సిందిగా ఎమ్మార్వో, అరైను ఆదేశించారు.

Read More ఆమనగల్లు ఎక్సైజ్ కార్యాలయంలో తాటి, ఈత మొక్కలు