రామోజీరావు నటించిన సినిమా ఏదో తెలుసా..?

రామోజీరావు నటించిన సినిమా ఏదో తెలుసా..?

 

రామోజీరావు కొన్ని గంటల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. సామాన్యుడి నుంచి అతిపెద్ద సామ్రాజ్య అధినేతగా ఎదిగిన ఆయన.. ఏ రంగంలోకి వస్తే ఆరంగంలో అగ్రభాగానే రాణించారు. మీడియా రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ఆయన.. సినిమా ఇండస్ట్రీకి ఓ పెద్ద దారి చూపించారు. అయితే ఆయన ఎన్నో సినిమాలను తీశారని మాత్రమే తెలుసు. 

Read More ఉద్యమకారుడి విగ్రహాన్ని తొలగించడం దారుణం. - చిలకమర్రి నరసింహ

కానీ ఆయన కూడా ఓ సినిమాలో నటించాడని చాలామందికి తెలియదు. ఒక సినిమాలో చిన్న అతిథి పాత్రలో నటించారు రామోజీ. 1978లో యు విశ్వేశ్వర రావు నిర్మించిన మార్పు అనే సినిమాలో రామోజీరావు ఒక న్యాయమూర్తి పాత్రలో నటించారు. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. రామోజీ రావు నటించింది కేవలం అతిథి పాత్రలోనే.

కానీ అప్పట్లో ఆ సినిమా పోస్టర్ మీద రామోజీరావు ఫొటో వేసి ప్రచారం చేయడం అందరినీ ఆకర్షించింది. ఎందుంకటే అప్పట్లో రామోజీ చరిష్మా అలా ఉండేది మరి. ప్రస్తుతం రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.

Related Posts