రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ 

రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ 

రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు.

రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు. ఆయన గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేసాయని గుర్తుచేశారు.  మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ, శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.

రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారని తెలిపారు. ఆయనతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆయనతో సంభాషించడం, ఆయన జ్ఞానం నుంచి ప్రయోజనం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ అసంఖ్యాక అభిమానులకూ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.. అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Read More అక్టోబర్ 2న ఎంగిలి పూల బతుకమ్మ.. ఈ ఏడాది బతుకమ్మ పండుగ తేదీలు ఇవే..!!