మరోసారి ఎన్టీయే పక్షనేతగా మోడీ.. ఆమోదించిన చంద్రబాబు, నితీష్

మరోసారి ఎన్టీయే పక్షనేతగా మోడీ.. ఆమోదించిన చంద్రబాబు, నితీష్

ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ, అమిత్ షా బలపరిచారు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌లు ఆయన ఎన్నికను ఆమోదించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం నిర్వహించారు.  సందర్భంగా ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను నితిన్ గడ్కరీ, అమిత్ షా బలపరిచారు. 

అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌లు ఆయన ఎన్నికను ఆమోదించారు. దీంతో మోడీని ఎన్డీయే పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ రాత్రి 7గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే పక్ష నేతలు కలువనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి మోడీ అందజేస్తారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 6గంటలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More హైద్రాబాద్ లో  నేషనల్ బడ్డింగ్ ప్రొఫెషనల్ - చెఫ్ కాంపిటీషన్స్ 2024

Related Posts