ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2700 పాయింట్ల నష్టంతో 73,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 838 పాయింట్లు నష్టపోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడాల్సివచ్చింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2700 పాయింట్ల నష్టంతో 73,739 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 838 పాయింట్లు నష్టపోయి 22,425 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది. ఎవరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోగా రెండు కూటములు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడినట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్‌గా వెలువడటంతో సోమవారం సరికొత్త రికార్డు స్థాయిలో భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఒక్కసారిగా కుదేలయ్యాయి. 

Read More హైదరాబాదులో ఎన్ఐఏ తనిఖీల కలకలం

ఇదిలా ఉండగా బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272ను దాటడంతో బీజేపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, రియలన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా, అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి.

Related Posts