అభివృద్ధి పనుల పరిశీలనకు రెడ్ కార్పెట్.. విజయ్ పర్యటనపై చర్చ

అభివృద్ధి పనుల పరిశీలనకు రెడ్ కార్పెట్.. విజయ్ పర్యటనపై చర్చ

అభివృద్ధి పనుల పరిశీలనకు రెడ్ కార్పెట్.. విజయ్ పర్యటనపై చర్చ.

సినిమా సెట్టింగ్‌ను తలపించిన విజయ్ తనిఖీలు.. నెటిజన్ల విమర్శలు.

Tamil Nadu News: టీవీకే (TVK) అధినేత విజయ్ చెన్నైలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా చేసిన ఏర్పాట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పర్యటన కోసం అధికారులు రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయడంతో ఆ దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలను టీవీకే వర్గాలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన పర్యటనలను ప్రచార ఆర్భాటాలుగా మార్చడం సరైన పద్ధతి కాదంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Read More బీహార్‌లో బీభత్సంగా వరదలు.. ఇళ్లను వదిలి బయటకు వస్తున్న గ్రామస్తులు

మరోవైపు, విజయ్ అభిమానులు మాత్రం అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం మంచి పరిణామమని, పర్యటనలో చేసిన ఏర్పాట్లను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది.

Related Posts