ట్రోల్స్‌తో మనస్తాపం చెంది పసిబిడ్డ తల్లి ఆత్మహత్య..!
తల్లి చేతుల్లోంచి జారి పడిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. అయితే తాజాగా తనపై వచ్చిన ట్రోల్‌ను తట్టుకోలేక చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
మూడు వారాల కిందట బాల్కనీ పైనుంచి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి పడిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. అయితే తాజాగా తనపై వచ్చిన ట్రోల్‌ను తట్టుకోలేక చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 28వ తేదీన చెన్నైలోని అవడిలోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఎనిమిది నెలల పసిబిడ్డ వేలాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
బిడ్డ కింద పడకుండా ఉండేందు పొరుగువారు బెడ్‌షీట్‌లు పట్టుకుని శిశువును రక్షించారు. ఇది అందరి హృదయాలను కదిలించింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకావడంతో ఆ పసిబిడ్డ తల్లి రమ్య(33)పై ఇంటా, బయటా సూటిపోటి మాటలు అనడంతో పాటు, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఘటన అనంతరం రమ్య తన బిడ్డను కారమడైలోని తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లింది. ఆదివారం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న రమ్యను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాప తల్లి మృతి పట్ల సినీనటుడు ప్రశాంత్ రంగస్వామిపై గాయని చిన్మయి ఘాటుగా విమర్శించింది. గతంలో పసిబిడ్డ తల్లిండ్రులను అవమానిస్తూ అతడు ట్వీట్ చేశారని ఫైర్ అయింది.
A child accidentally fell from a balcony, got stuck in a shed, and was rescued by people after a few minutes of struggling at Choolaimedu area in #Chennai 👇 pic.twitter.com/u467mXoXrp
— 𝗴𝘀𝗰ʜᴀɴᴅʀᴇꜱʜ | சந்திரேஷ் (@gschandresh) April 28, 2024