ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమి వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు.

రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమి వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో 10మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ 10 మంది విద్యార్థులు వీకెండ్ కావటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఫుడ్ కోర్టుకు వెళ్లారు.

రాత్రి అక్కడ భోజనం చేసిన విద్యార్థులు రెండు కార్లలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో పోలీస్ అకాడమి వద్ద కార్లు రోడ్డు పక్కన నిలిపారు. ఔటర్ రింగు రోడ్డులో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ అదుపుతప్పి ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం ధాటికి వారి శరీరాలు నుజ్జు నుజ్జయ్యాయి. 

Read More నెక్లెస్ రోడ్ లో "రన్ ఫర్ క్వాలిటీ" రన్నింగ్ పోటీలను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.మరికొందరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరిలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందినవారి వివరాలు తెలియాల్సివుంది.