వికారాబాద్‌లో చిరుత కలకలం.. వ్యక్తికి తీవ్రగాయాలు

వికారాబాద్‌లో చిరుత కలకలం.. వ్యక్తికి తీవ్రగాయాలు

చిరుతదాడిలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

చిరుతదాడిలో ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో  గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చౌడాపూర్ మండలంలోని కొత్తపలిల గ్రామ సమీపంలో బాత్రూం వెళ్లిన శేఖర్‌పై చిరుత దాడి చేసింది. దాని బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతడి చేయికి తీవ్రగాయాలయ్యాయి. 

ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, శేఖర్‌కు ప్రాణాపాయం తప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. చిరుత అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాళ్లను గుర్తించి బోన్‌లో బంధించి తీసుకువెళ్లాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Read More పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం:జిల్లా ఎస్.పి రూపేష్