తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోవడానికి తగు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. 

కాగా, తిరుమల నుంచి చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం ఆయన బాధ్యతల స్వీకరణ ఉంటుంది. ఇవాళ(గురువారం) సాయంత్రం 4.41 గంటలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ చాంబర్‌లో చంద్రబాబు బాధ్యతలను స్వీకరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, వృద్ధాప్య పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నట్లు సమాచారం.

Related Posts