కూటమి గెలుపుకు కార్యకర్తలే కారణంః సీఎం చంద్రబాబు

కూటమి గెలుపుకు కార్యకర్తలే కారణంః సీఎం చంద్రబాబు

 

కార్యకర్తలు, నాయకులతో టెలీ కాన్ఫరెన్స్..
ప్రతి శనివారం పార్టీ ఆఫుసుకు సీఎం

 

సీఎం చంద్రబాబు నాయు గతంలో కంటే భిన్నంగా ఈ సారి పాలన సాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పార్టీతో సమన్వయం కూడా లోపించుకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు సీఎం. ఇందులో భాగంగానే శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పలువురు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు చంద్రబాబు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ఘన విజయం సాధించడం వెనుక నాయకులు, కార్యకర్తల అలుపెరగని శ్రమ, ఆపార కృషి ఉందని కొనియాడారు. ఇక నుంచి పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని చోట గెలిచామని, ఈ విజయం కార్యకర్తలకు అంకితం అని ఆయన ప్రకటించారు. 

అంతే కాకుండా ఇక నుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ ఆఫీసుకు తాను వస్తానని, అందరి సమస్యలు వింటానని తెలిపారు చంద్రబాబు నాయుడు. 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్‌ను కూటమి సాధించిందన్నారు. ఇక ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు.

Related Posts