కేదార్‌నాథ్‌లో హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్....

కేదార్‌నాథ్‌లో హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్....

విశ్వంభర,వెబ్ డెస్క్ : కేదార్‌నాథ్‌లో హెలికాప్ట‌ర్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వ‌ల్ల ఆ హెలికాప్ట‌ర్‌ను అత్య‌వ‌స‌రంగా దించేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హెలిప్యాడ్‌కు దాదాపు 100 మీటర్ల ముందు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. పైలట్‌తో సహా ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని హెలికాప్టర్ పైలట్ తెలిపారు. ఇదిలావుండగా, హెలికాప్టర్ సిర్సీ హెలిప్యాడ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు వస్తోందని, ఆరుగురు ప్రయాణికులతో ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ 7.05 గంటల ప్రాంతంలో కేదార్‌నాథ్ ధామ్ హెలిప్యాడ్‌కు దాదాపు 100 మీటర్ల ముందు అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని ఆయన చెప్పారు. హెలికాప్ట‌ర్‌లోని రోట‌ర్‌కు స‌మ‌స్య తలెత్త‌డంతో.. క్రిస్ట‌ల్ కంపెనీకి చెందిన ఆ హెలికాప్ట‌ర్‌.. హెలిప్యాడ్‌కు దూరంగా ల్యాండ్ అయ్యింది. ఫ‌టా నుంచి కేదార్‌నాథ్ ఆల‌యానికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Read More తెలంగాణ కు ప్రోత్సాహక 176.5 కోట్లు

Tags:

Related Posts