అమ్మో పులి..! ఉలిక్కిపడ్డ గ్రామస్థులు.. చివరికి నిజం తెలిసి షాక్ 

... చిరుత పులి కాదు....అడవి జంగ పిల్లి 
...పలు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసిన ఆకతాయిలు 
...రాత్రంతా భయంతో ఇంటి నుండి బయటకు రాని గ్రామ ప్రజలు 
...తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు 
...అనాజిపురం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉదయ్ 
...అవి చిరుత పులి పిల్లలు కాదు అడవి జంగ పిల్లి అని నిర్ధారణ చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి

13

విశ్వంభర చింతపల్లి జులై 11:
చింతపల్లి మండలం హోమంతాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అనాజీపురం గ్రామంలో రెండు చిరుత పులి పిల్లలు కనిపించాయి అంటూ బుధవారం అదే గ్రామానికి చెందిన కొందరు ఆకతాయిలు వాట్సాప్ గ్రూపుల్లో, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేశారు. 
అది నిజమే అనుకుని గ్రామస్తులు భయంతో బిక్కుబిక్కుమంటూ ఇండ్లలోనే కర్రలు పట్టుకొని రాత్రంతా జాగారాలు చేశారు. అనాజిపురం గ్రామంలో చిరుత పులి పిల్లలు కనిపించాయ్న సమాచారం తెలుసుకుని ఫారెస్ట్ బీట్ అధికారి ఉదయ్ కుమార్ గురువారం గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన
దృశ్యాలను బట్టి అది చిరుత కాదు అడవి జంగ పిల్లి అని తేల్చేశారు. స్థానికులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని సూచించారు. ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చిరుత పులి సంచారం చేస్తుందని పుకార్లు పుట్టించడం సరికాదని అన్నారు. పుకార్లు పుట్టించే ముందు అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన పనిలేదని అన్నారు. అది చిరుత పులి కాదు అడవి జంగ పిల్లి అని తెలియడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More  జిల్లెలగూడలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  విగ్రహావిష్కరణ