మై డియర్ ఫ్రెండ్: సీఎం రేవంత్ రెడ్డిపై రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కలిశాడు. దర్శకుల బృందం వెళ్లి ఈనెల 19న జరిగే డైరెక్టర్స్ డే కార్యక్రమానికి రావాలని సీఎంను కోరారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కలిశాడు. దర్శకుల బృందం వెళ్లి ఈనెల 19న జరిగే డైరెక్టర్స్ డే కార్యక్రమానికి రావాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్(X) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు.
మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానంటూ సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. అయితే వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, కేవలం ఆర్జీవీ కాకుండా అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆర్జీవీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటాడు. దీంతో తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తాడన్న విషయం తెలిసిందే.